Home > సినిమా > 30 ఏళ్ల నాటి 'ప్రేమికుడు' మూవీ రీ రిలీజ్

30 ఏళ్ల నాటి 'ప్రేమికుడు' మూవీ రీ రిలీజ్

30 ఏళ్ల నాటి ప్రేమికుడు మూవీ రీ రిలీజ్
X

30 ఏళ్ల నాటి సూపర్ హిట్ మూవీ 'ప్రేమికుడు' రీరిలీజ్ కానుంది. కేటి కుంజుమన్ నిర్మాతగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రీ రిలీజ్ కానుండటంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ మూవీ ఈవెంట్‌ను నేడు నిర్వహించారు. అప్పట్లో ఈ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది.

ప్రేమికుడు మూవీలో హీరో ప్రభుదేవా వేసిన స్టెప్పులను ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అప్పట్లో ఆ మూవీలోని ప్రభుదేవా డ్యాన్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయేవారు. స్ప్రింగ్స్ ఏమన్నా మింగాడా అని అనుకునేవాళ్లు. అప్పట్లోనే ఒక మంచి ప్రేమ కథగా సన్సేషన్ సృష్టించిన మూవీ ఇన్నాళ్లకు రీరిలీజ్ కానుంది. హీరోయిన్ నగ్మా అందాలు ఈ మూవీకి హైలెట్‌గా ఉంటాయి. ప్రభుదేవా నటన, డ్యాన్స్‌లు ఓ వైపు, మరోవైపు హీరోయిన్ నగ్మా చేసే అల్లరిపనులు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటాయి.

ఆ రోజుల్లోనే రూ.3 కోట్లు వసూలు చేసిన సినిమా ఇప్పుడు 30 కోట్ల వరకూ సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇందులో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా డ్యాన్స్ వేయడం విశేషం. అతి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని, ఆ ఈవెంట్‌కు ప్రభుదేవా కూడా వస్తాడని మేకర్స్ తెలిపారు. రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Updated : 18 March 2024 7:09 PM IST
Tags:    
Next Story
Share it
Top