Prakash Raj : మూడు పార్టీలు నాకు ఎంపీ టికెట్ ఇస్తానంటున్నాయ్: ప్రకాశ్ రాజ్
X
తన నటనతో అందరినీ మెప్పించే ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడిగా పేరు సంపాధించుకున్నాడు. అయితే ఇటీవల రాజకీయ పరంగా పలు విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని మూడు ప్రధాన పార్టీలు తనకు టికెట్ ఇస్తానని వెంట పడుతున్నయని ఆయన చెప్పారు. ఆ ట్రాప్ లో పడకూడదని ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
నేడు రాజకీయ పార్టీలన్నీ తమ గొంతును కోల్పోయి. అందుకే అభ్యర్థులు దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాను ఎవరినీ ద్వేషించనని చెప్పారు. నేను మోదీని ఎందుకు ద్వేషిస్తా. ఆయన నాకేమైనా మామ అవుతారా. లేదా ఏమైనా ఆస్తి సమస్య ఉందా? నేను కేవలం ట్యాక్స్ చెల్లింపుదారుడిని అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మనం ఆయనకు జీతం ఇస్తున్నాం. పని సక్రమంగా చేయమని చెప్తున్నాం. ప్రస్తుతం ఆయన తన పనిని సక్రమంగా చేయడం లేదు. అందుకే చేయమని చెప్తున్నా. అది విమర్శించడం, ద్వేషించడం కాదని ప్రకాశ్ రాజ్ చెప్పారు.