ఏంటిది ప్రకాష్ రాజ్...నీ స్థాయికి తగ్గట్టు లేదు
X
వెర్శటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ సినిమాల్లో ఎంత వివాదాస్పదంగా ఉంటారో...బయట కూడా అలానే ఉంటారు. పాలిటిక్స్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడారు కూడా. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ చాలా విమర్శల పాలవుతోంది. ఏంటి ప్రకాష్ రాజ్ మరీ ఇలాంటి పనులు చేయాలా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
చంద్రయాన్-3...భారత్ కు ఇదొక ప్రతిష్ట ఇప్పుడు. మన ల్యాండర్ చంద్రుని మీద అడుగుపెట్టే రోజు కోసం యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో దీని మీద ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. విక్రయ్ ల్యాండర్ చంద్రుని మీద దిగిన తర్వాత పెట్టే మొదటి పోటో అంటూ ఒక ఫోటోను జత చేశారు. ఇప్పుడు అదే చాలా మందికి నచ్చడం లేదు. మీ స్థాయికి తగ్గట్టు లేదంటూ ప్రకాష్ రాజ్ మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
అధికార పార్టీ బీజెపీకి, ప్రకాష్ రాజ్ కు పడదు. ఎప్పుడు ఆ పార్టీ, ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రయాన్ విషయంలో కూడా బీజెపీని లాగారు ప్రకాష్ రాజ్. ఒక టీ అమ్మే వ్యక్తి ఫోటో పెట్టి...విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద దిగాక పెట్టిన మొదటి ఫోటో అంటూ పోస్ట్ పెట్టారు. పైగా వావ అంటూ దానికి క్యాప్షన్ కూడా జత చేశారు. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయినట్టు...ప్రభుత్వాన్ని విమర్శిద్దామకున్నారు కానీ ప్రతిగా తానే విమర్శలు పాలవుతున్నారు ప్రకాష్ రాజ్. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో ఎటువంటి రాంగ్ లేదు కానీ ప్రతీ దాన్ని విమర్శించాలనుకోవడం తప్పని అంటున్నారు నెటిజన్లు. చంద్రయాన్ కు, ప్రభుత్వానికి ముడి పెట్టడంలో అస్సలు అర్ధం లేదని కోపం వ్యక్తం చేస్తున్నారు.
BREAKING NEWS:-
— Prakash Raj (@prakashraaj) August 20, 2023
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G