Home > సినిమా > నువ్వు నాకు ఒక క్లాస్ రూమ్...ప్రసాద్స్ గురించి రాజమౌళి ఎమోషనల్ ట్వీట్

నువ్వు నాకు ఒక క్లాస్ రూమ్...ప్రసాద్స్ గురించి రాజమౌళి ఎమోషనల్ ట్వీట్

నువ్వు నాకు ఒక క్లాస్ రూమ్...ప్రసాద్స్ గురించి రాజమౌళి ఎమోషనల్ ట్వీట్
X

ప్రపంచం గుర్తించిన తెలుగు దర్శకుడు రాజమౌళి. సినిమాలే తన ప్రాణం అని ఆయన చాలాసార్లు చెప్పారు. వాటి మీద తనకున్న అనుబంధాన్ని పదే పదే చెబుతుంటారు కూడా. తాజాగా మరోసారి సినిమాల పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేశారు. అలాగే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ తో అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రసాద్స్ వచ్చి 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ థియేటర్ తో తనకున్న అనుబంధాన్ని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

హైదరాబాద్ లో ప్రసాద్స్ మొట్టమొదటి మల్టీప్లెక్స్. తెలుగు చిత్రపరిశ్రమలోనే ఈ మల్టీప్లెక్స్ ప్రయాణానికి ఓ చరిత్ర ఉంది. కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే అక్కడ జాతరే. ఈ మల్టీప్లెక్స్ స్థాపించి ఇరవై ఏళ్లవుతోంది.దీన్నే గుర్తు చేసుకున్నారు రాజమౌళి.

ఎన్ని శుక్రవారాలు, ఫస్ట్ డే...ఫస్ట్ షోలు ఉదయాన్నే పరుగెత్తుకుంటూ వెళ్ళాను. 8.45కి సీట్లో కూర్చోవాలని ఆరాట పడ్డాను. ప్రసాద్స్ పెట్టి అప్పుడూ 20 ఏళ్ళు అయిందా?? ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్....నువ్వు నాకు క్లాస్ రూమ్. నీ నుంచి నేను నన్ను తీర్చిదిద్దుకున్నాను ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ప్రసాద్స్ మీద తీసిన స్పెషల్ వీడియో గురించి కూడా చెప్పారు. అలాగే సినిమాల గురించి కూడా చెబుతూ....ప్రతీ సినిమా వినోదాత్మకంగా ఉన్నా...నిరాశపరిచినా...నాకు అదొక గుణపాఠమే అన్నారు జక్కన్న. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.




Updated : 28 July 2023 11:18 AM IST
Tags:    
Next Story
Share it
Top