Home > సినిమా > Hanuman: తీసినోడు నా కొడుకు...ప్రశాంత్‌ వర్మ తండ్రి వీడియో వైరల్‌

Hanuman: తీసినోడు నా కొడుకు...ప్రశాంత్‌ వర్మ తండ్రి వీడియో వైరల్‌

Hanuman: తీసినోడు నా కొడుకు...ప్రశాంత్‌ వర్మ తండ్రి వీడియో వైరల్‌
X

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో.. స్టార్ హీరోల సినిమాల కన్నా, చిన్న సినిమాగా రిలీజైన హనుమాన్ పేరే వినిపిస్తుంది. జాంబి రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బ‌స్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుంద‌ని, వీఎఫ్ఎక్స్, విజువల్స్​ అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత్ వ‌ర్మ తండ్రి మూవీపై రివ్యూ ఇచ్చాడు. హనుమాన్ తీసినోడు నా కొడుకు.. ప్రశాంత్ వ‌ర్మ తండ్రిని అయినందుకు గొప్పగా భావిస్తున్నాను అంటూ త‌న‌ ఆనందాన్ని పంచుకున్నారు. హ‌నుమాన్ అద్భుతంగా ఉందని, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ అని అందరూ బాగా నటించారని చెప్పుకొచ్చారు. హనుమాన్‌పై త్వరలోనే తన కొడుకు డైరెక్ట్‌ సినిమా తీస్తాడని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో తనను అభినందించేందుకు చాలా మంది ఫోన్‌ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే, తాను జ్వరంతో బాధపడుతున్నాననీ.. ఆరోగ్యం కుదుటపడగానే అందరినీ కలుస్తానంటూ పోస్ట్‌ పెట్టారు.

ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా కథా నాయకుడిగా నటించాడు. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాను జ‌నాలు క్యూ క‌డుతున్నారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల సంఖ్య పెంచారు. త్వరలోనే దీని సక్సెస్‌ టూర్‌ను చిత్రబృందం ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Updated : 14 Jan 2024 1:07 PM IST
Tags:    
Next Story
Share it
Top