Home > సినిమా > కేజీఎఫ్‌కి మించి సలార్.. ప్రశాంత్ నీల్ ప్రామిస్!!

కేజీఎఫ్‌కి మించి సలార్.. ప్రశాంత్ నీల్ ప్రామిస్!!

కేజీఎఫ్‌కి మించి సలార్.. ప్రశాంత్ నీల్ ప్రామిస్!!
X

`కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్న హైవొల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సలార్. సెప్టెంబ‌ర్ 28న భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఫ‌స్ట్ డే రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే ఈలోగా ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ బయటకు రావడంతో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. 180 నిముషాలు(3 గంటల) రన్ టైమ్‌తో ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. చెప్పాలంటే ఇది లెంగ్తీ రన్ టైమ్. అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్ట్ లు కూడా బాగా లెంగ్తీ గానే ఉంటాయి. అయినా భాక్సాఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమీ పడలేదు. కాబట్టి ఈ సినిమా కూడా లెంగ్త్ పరంగా భయపడాల్సిందేమీ లేదంటున్నారు.

అయితే ఈ విషయంపై ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ ప్రామీస్ చేశాడంటున్నారు. ప్రతీ విషయంలో సలార్.. కేజీఎఫ్‌కు మించి ఉంటుందని చెబుతున్నాడట. గ్రాఫిక్స్‌లోనూ, యాక్షన్ సీక్వెన్స్‌లోనూ.. ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పించేలా సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఎక్కువ శాతం యాక్ష‌న్ సీన్లే ఉంటాయ‌ని, అవి హైవోల్టేజ్‌తో సాగుతాయ‌ని తెలిపాడు ప్రశాంత్ నీల్. ఇందులో ప్ర‌భాస్‌ని మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా ప్ర‌శాంత్ నీల్ చూపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఊహించ‌ని క‌థ‌, క‌థ‌నాల‌తో రానున్న ఈ సినిమా ఖ‌చ్చితంగా బాక్సాఫీస్ వ‌ద్ద వెయ్యి కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జ‌గ‌ప‌తిబాబు ఇందులో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో శ్రియారెడ్డి, ర‌క్షిత్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది.


Updated : 16 Aug 2023 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top