Home > సినిమా > Prashanth Varma : హనుమాన్ సీక్వెల్ హీరో తేజ కాదు.. ఆ స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ

Prashanth Varma : హనుమాన్ సీక్వెల్ హీరో తేజ కాదు.. ఆ స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ

Prashanth Varma : హనుమాన్ సీక్వెల్ హీరో తేజ కాదు.. ఆ స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ
X

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ మెన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ఇక సినిమా చివర్లో 'హనుమాన్'సీక్వెల్ పై ఒక్కసారిగా ఆసక్తి పెంచేశారు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే ఓ షాట్ సీక్వెల్ ఫై అంచనాలను భారీగా పెంచేసింది. ఆ షాట్ లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్టుగా చూపించారు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో ఇతిహాస పాత్రలైనా ఆంజనేయుడు శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనే విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపాయి. దీంతో హనుమాన్ సీక్వెల్ లో శ్రీరాముడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తారంటూ ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది నిజమే అన్నట్లుగా ‘హను-మాన్‌’ సక్సెస్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో ప్రశాంత్ వర్మ కీలక కామెంట్స్ చేశాడు.





హనుమాన్ సీక్వెల్‌లో తేజ హీరో కాదని, స్టార్ హీరోతో జై హనుమాన్ ఉంటుందని చెప్పాడు. ‘‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉండనుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. ‘జై హనుమాన్‌’లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు. 2025లో ఇది విడుదల కానుంది’’ అని ప్రశాంత్‌ చెప్పారు. టీమ్‌ సహకారంతోనే తాను ఈ విజయాన్ని అందుకోగలిగానన్నారు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో ‘హను-మాన్‌’ చేశామని, విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళ్లు చేసినట్లు చెప్పారు.






Updated : 22 Jan 2024 2:38 PM IST
Tags:    
Next Story
Share it
Top