‘మేము రిస్క్ తీసుకోం’.. మా సినిమాను ఆదిపురుష్తో కంపేర్ చేయకండి
X
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు ప్రశంసల కన్నా మిమర్శలే ఎక్కువ వచ్చాయి. సినిమాలో పాత్రలు మార్చేశారని, గెటప్ లన్నీ చేంజ్ చేశారని అందరు అంటున్నారు. అయితే, ఈ జనరేషన్ కు తగ్గట్టే మోడ్రన్ గా సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ ఓం రౌత్ వివరించాడు. గ్రాఫిక్స్, గెటప్ తో తేడా కొట్టిందని సినీ ప్రియులు అంటున్నారు. ఈ క్రమంలో అందరి చూపు ప్రశాంత్ వర్య తెరకెక్కిస్తున్న హనుమాన్ సినిమాపై పడింది. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమాను కూడా ఆదిపురుష్ లా ఉంటుందా..? అని ప్రశాంత్ ను ప్రశ్నిస్తున్నారు.
‘మా సినిమాపై ఆదిపురుష్ ఎఫెక్ట్ ఉండదు. చిన్నప్పటి నుంచి మనం విన్న, చూసిన, చదివిన విధంగానే మా సినిమాలో హనుమంతుడు కనిపిస్తాడు. ఆదిపురుష్ లా ప్రయోగాలేం చేయలేదు. ఈ సినిమాలో మా బెస్ట్ ఇవ్వడానికి సాధ్యమైనంత కష్టపడుతున్నాం. మొదటి నుంచి కూడా మా సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి టీజర్ నుంచి జనాలు ఆదరిస్తున్నారు. దాంతో సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.
కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాత్ వర్మ.. హనుమాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ భారీ అంచనాలను పెంచేశాయి.