Bigg boss season 7 : శుభ శ్రీ ఎలిమినేట్.. అంతా యావర్ పుణ్యమేనట..
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఉల్టాపల్టా సీజన్ ఐదు వారాలుగా అందరినీ అలరిస్తోంది. ఫిఫ్త్ వీకెండ్లో హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఈసారి కూడా ఫిమేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడంతో ఈవారం శుభ శ్రీ రాయ్గురు ఎలిమినేట్ అయింది. ఐదోవారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ అమ్మాయిలపై పగ పట్టాడంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సుబ్బు ఎలిమినేట్ కావడానికి ప్రిన్స్ యావర్ కారణమట. అతని కారణంగానే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. యావర్ ఎవరితో పులిహోర కలిపినా నెక్ట్స్ వీక్ వారికి మూడినట్లేనని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఐదు వారాల్లో ఎలిమినేట్ అయిన ఫిమేల్ కంటెస్టెంట్లలో నలుగురు ప్రిన్స్తో క్లోజ్ గా మూవ్ అయినవారే కావడం విశేషం.
సీజన్ ఫస్ట్ వీక్లో ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్తో పులిహోర కలిపాడు. నిజానికి వారిద్దరికీ లాంగ్వేజ్ ప్రాబ్లెం కారణంగా కాస్త క్లోజ్ అయ్యారు. అయితే ప్రిన్స్ తో సరదాగా ఉన్న కిరణ్.. ఫస్ట్ వీక్లోనే హౌస్లోంచి బయటకు వచ్చేశారు. ఇక రెండోవారం ఎలిమినేట్ అయిన షకీలాను ఆ వారం కేవలం యావర్ ఒక్కడే నామినేట్ చేశాడు. అతని నామినేషన్ కారణంగానే సెకండ్ వీక్ షకీలమ్మ ఎలిమినేట్ అయింది.
ఇక థర్డ్ వీక్లో సింగర్ దామిని, ప్రిన్స్ యావర్ మధ్య రొమాన్స్ మొదలైంది. వీక్ స్టార్టింగ్లో ఇద్దరికీ పడకపోయినా ఆ తర్వాత ఇద్దరూ క్లోజయ్యారు. కుబూల్ హే కుబూల్ హే అంటూ సరదాగా ఆట పట్టించుకున్నారు. అదేంటో కానీ ఆ వారం కూడా యావర్ పులిహోర కలిపిన దామిని ఎలిమినేట్ అయింది. ఇక నాల్గో వారంలో బిగ్ బాస్ హౌస్ రాధిక.. రతిక రోజ్, ప్రిన్స్ యావర్ మధ్య రొమాన్స్ మొదలైంది. యావర్ను అన్వర్ పేరుతో పిలుస్తూ రతిక బాగానే పులిహోర కలిపింది. మూడు నాలుగురోజుల పాటు వారిద్దరీ మధ్య క్లోజ్నెస్ కొనసాగింది. అయితే వీకెండ్ వచ్చేసరికి రతిక పెట్టే బేడా సర్దుకుని హాస్ నుంచి బయటకు వచ్చేసింది.
ఫిఫ్త్ వీక్ విషయానికొస్తే యావర్, శుభ శ్రీ మధ్య బాండ్ పెరిగింది. ఈ వారం వారిద్దరూ మరింత క్లోజ్ అయ్యారు. కలర్ టాస్క్ సమయంలో వారిద్దరూ బాల్కనీ మెట్లపై కూర్చొని రొమాంటిక్గా మాట్లాడుకోవడంతో వారిద్దరి లవ్ ట్రాక్ మొదలైందన్న భావన కలిగింది. లెటర్ టాస్క్ విషయంలో యావర్ శుభ శ్రీని ఓదార్చడం, ఆమెకు నచ్చజెప్పిన తీరు అందరికీ నచ్చింది. కానీ ఎవరూ ఊహించని విధంగా యావర్కు దగ్గరైన శుభశ్రీ ఫిఫ్త్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది. ఇలా ప్రిన్స్తో ఎవరు క్లోజ్గా ఉన్నా వారు ఆ వీక్ తట్టా బుట్టా సర్దుకోవాల్సి వస్తుండటంపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.