Prithviraj Sukumaran : బానిసగా మారిన స్టార్ హీరో.. కన్నీళ్లు పెట్టిస్తోన్న కొత్త మూవీ ట్రైలర్
X
'సలార్' మూవీలో మెరిసిన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'సలార్' సినిమా తర్వాత తెలుగు ఆడియన్స్‌కు ఈ హీరో బాగా కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయనే ఓ పాన్ ఇండియా మూవీని తీసుకొస్తున్నారు. ఈ మూవీ కోసం పృథ్వీరాజ్ అప్పట్లో 'సలార్' మూవీ షూటింగ్‌ని కూడా పోస్టుపోన్ చేశారు. నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంతో సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
'ఆడు జీవితం' టైటిల్‌తో పృథ్వీరనాజ్ మూవీ తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. గతంలోనే ఈ మూవీ టీజర్ విడుదలైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కేరళకు సంబంధించిన ఓ హీరో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు ప్రయాణం అవుతాడు. అయితే సౌదీలో అతన్ని ఓ బానిసలాగా చూస్తారు. ఎన్నో సమస్యలు పెడుతుండటంతో హీరో నరకం అనుభవిస్తాడు. ఇక అక్కడి నుంచి ఇండియాకు వెళ్లిపోదాం అని అనుకుంటాడు. కానీ వెళ్లలేని పరిస్థితి ఉంటుంది.
నడక మార్గంలో సౌదీ నుంచి ఇండియాకు వెళ్లిపోదాం అని అనుకుంటాడు. అయితే ఆ ప్రయాణంలో హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? ఇండియాకు చేరుకుంటాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ అని మేకర్స్ తెలిపారు. గతంలో ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చాలానే వచ్చాయి. అందులో 'లైఫ్ ఆఫ్ పై' అనే మూవీ ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ట్రైలర్ కూడా అలాగే థ్రిల్ చేస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 28వ తేదిన ఈ చిత్రం విడుదల కానుంది.