Home > సినిమా > వాస్తవ కథతో వస్తున్న 'ది గోట్ లైఫ్'

వాస్తవ కథతో వస్తున్న 'ది గోట్ లైఫ్'

వాస్తవ కథతో వస్తున్న ది గోట్ లైఫ్
X

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రెబల్ స్టార్‌తో కలిసి 'సలార్' మూవీలో కనిపించారు. ఇప్పుడు 'ది గోట్ లైఫ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ఆడు జీవితం' అనే పేరుతో ఈ మూవీలో తెలుగులో విడుదల కానుంది. ఈనెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బెన్యామిన్ అనే రచయిత రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ మూవీతో రూపొందుతోంది. డైరెక్టర్ బ్లెస్సీ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, శశి పాల్గొన్నారు. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. సలార్ మూవీలో వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్‌లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యానని, ఇప్పుడు 'ఆడు జీవితం' సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్‌తో వస్తున్నానని తెలిపారు. వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ఆదరించాలని కోరారు.

90వ దశకంలో బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకం ప్రసిద్ది చెందిందన్నారు. 2008లో కేరళలో పబ్లిష్ అయిన ఆ పుస్తకం ఆధారంగా ఈ మూవీని తీసినట్లు తెలిపారు. 2019లో షూటింగ్ ప్రారంభించి ఇప్పటికి విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ మూవీ కోసం తాను 31 కిలోలు తగ్గానన్నారు. ఈ మూవీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రాజెక్ట్ పూర్తి చేశామన్నారు.

డైరెక్టర్ బ్లెస్సీ మాట్లాడుతూ.. దాదాపు 150 రోజులు ఎడారిలో షూటింగ్ చేశామన్నారు. బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశామన్నారు. 28న విడుదలయ్యే ఆడు జీవితం మూవీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలన్నారు. కేరళలో 250 ఎడిషన్స్ పబ్లిష్ అయిన నవల ఆధారంగా సినిమా చేశామన్నారు. ప్రతి కేరళ వాసికి ఈ గోట్ డేస్ నవల, అందులోని క్యారెక్టర్స్ తెలుసని, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగే స్ఫూర్తిని ఈ మూవీ అందిస్తుందని తెలిపారు.


Updated : 22 March 2024 1:39 PM GMT
Tags:    
Next Story
Share it
Top