‘నేను నా భర్తను భయపెడతా’.. భర్తతో గొడవలపై నోరు విప్పిన ప్రియమణి
X
స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు అప్పట్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి హైప్ లో ఉన్న టైంలో.. 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయింది. తర్వాత పలు టీవీ షోస్‌లో జడ్జీగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మళ్లీ దగ్గరైంది ప్రియమణి. కొంతకాలం తర్వాత నాగచైతన్య హీరోగా 2023లో వచ్చిన కస్టడీ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈవిడ నటించిన వెబ్‌సిరీస్ ‘భామా కలాపం-2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 16 నుంచి ప్రముఖ ఓటీటీలో సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. తన భర్తతో జరిగే గొడవలపై స్పందించింది. భామా కలాపంలో గ్యాంగ్ స్టర్స్ ను అల్లాడించే వైలెంట్ పాత్రలో నటించిన ప్రియమణి.. నిజ జీవితంలో భర్తను భయపెడుతుందా? తానే భయపడుతుందా? అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ప్రియమణి.. తాను భర్తకు భయపడతానని బదులిచ్చింది. ‘నేను భర్తకు భయపడతాను. అదే టైంలో భయపెడతాను కూడా. అయితే వైలెన్స్ రూపంలో కాదు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం భర్త మాట వినాలి. మన మాట భర్త వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్యాభర్తలన్నాక గొడవలు సహజం’అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.