Home > సినిమా > రూ.165 కోట్ల ఇంటిని వీడిని ప్రియాంక చోప్రా.. అసలేం జరిగిందంటే..?

రూ.165 కోట్ల ఇంటిని వీడిని ప్రియాంక చోప్రా.. అసలేం జరిగిందంటే..?

రూ.165 కోట్ల ఇంటిని వీడిని ప్రియాంక చోప్రా.. అసలేం జరిగిందంటే..?
X

గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ పాప్ సింగర్ నిక్ జొనాస్ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది. అప్పటినుంచి ఇండియన్ సినిమాల్లో నటించడం తగ్గించేసింది. సిటాడెల్ వంటి పలు వెబ్ సిరీస్లతో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లో మెరిసింది. అయితే పెళ్లి తర్వాత ప్రియాంక దంపతులు లాస్ ఏంజిల్స్లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొన్నారు. ఇప్పుడు ఆ ఇంటిని వీడారు.

రూ.165 కోట్లు పెట్టి ఓ పెద్ద భవనాన్ని ప్రియాంక దంపతులు కొనుగోలు చేశారు. అయితే తాజాగా ఈ ఇంటి నుంచి ప్రియాంక దంపతులు బయటకు వచ్చేశారు. ఇంట్లో నీళ్లు లీక్ అవుతుండడంతో ఖాళీ చేశారు. నీరు లీకేజీ అవ్వడం వల్ల ఇంట్లోని చాలా ప్రాంతాలు డ్యామేజీ అయినట్లు సమాచారం. దీనిని రిపేర్ చేయడానికి సుమారు 2.5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. దీంతో ఇళ్లు అమ్మిన వ్యక్తిపై ప్రియాంక దంపతులు కోర్టుకెక్కారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని దావా వేశారు.

కాగా ఈ విలాసవంతమైన భవనంలో 7 బెడ్ రూంలు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, స్పా, హోం థియేటర్, స్టీమ్ షవర్, జిమ్ వంటి ఎన్నో వసతలు ఉన్నాయి. పిల్లలతో ఉండే ప్రతీక్షణం అపురూపంగా ఉండాలని వీరు ఈ ఇంటిని కొనుగొలు చేశారు. ఇంటికి వచ్చాక తమ అభిరుచికి అనుగుణంగా కొన్ని కీలక మార్పులు సైతం చేయించారు. అయితే నీరు లీకేజీ అవడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి.

Updated : 1 Feb 2024 4:43 PM IST
Tags:    
Next Story
Share it
Top