Home > సినిమా > యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా.. హీరోయిన్ ప్రియాంక చోప్రా!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా.. హీరోయిన్ ప్రియాంక చోప్రా!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా.. హీరోయిన్ ప్రియాంక చోప్రా!!!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్ ఉన్న వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ మూవీపై మరో క్రేజ్ బజ్ నెలకొంది.



తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. ఆమధ్య ఈ సినిమాలో దీపికా పడుకోనే నటించబోతుందని తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. ఇక లేటెస్ట్‌గా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్ అయిదని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.. అందుకే ఆ పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నాట. ఈ సినిమా పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇవే కాకుండా.. ఈసారి తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న 'వార్ 2' చిత్రంలో తారక్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించనున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. వార్ ఫ్రాంచైజీ యొక్క రెండవ భాగాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.

Updated : 7 Jun 2023 9:06 AM IST
Tags:    
Next Story
Share it
Top