Home > సినిమా > Chiranjeevi :చిరంజీవిపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Chiranjeevi :చిరంజీవిపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Chiranjeevi :చిరంజీవిపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
X

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అగస్ట్ 11న రిలీజైన ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. నాలుగు రోజుల్లో కనీసం 50కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయిది. తమిళ వేదాళం రిమేక్గా తెరకెక్కిన ఈ మూవీని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ చిరు చెల్లిగా నటించగా.. తమన్నా హీరోయిన్గా చేసింది. అయితే చిరంజీవి ఈ మూవీ నిర్మాత మధ్య ఓ వివాదం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.

నిర్మాతలపై ఒత్తిడి తెచ్చి చిరు తన రెమ్యునరేషన్ను వసూల్ చేశారనే ప్రచారం జరిగింది. ‘‘సినిమా వల్ల అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు పెట్టారు. అయినా చిరంజీవి మాత్రం ముక్కుపిండి రెమ్యునరేషన్ వసూల్ చేసుకున్నారు’’ అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు అటు చిరు, ఇటు నిర్మాతం వీటిపై స్పందించకపోవడంతో చిరు యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఈ క్రమంలో నిర్మాత అనిల్ సుంకర స్పందించారు.

ఈ వివాదంపై ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ బేస్ లెస్, సెన్స్ లెస్ కామెంట్స్. వాటిలో ఒక్కశాతం కూడా నిజం లేదు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి అని ట్వీట్ చేసింది. మరి ఇప్పటికైనా ఈ ప్రచారం ఆగుతుందా అనేది చూడాలి.

భోళాశంకర్ తర్వాత చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. అగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే.. ఆ రోజు ఆయన తర్వాత సినిమాపై ఏదైన అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక భోళా శంకర్ మూవీపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇది అవుట్ డేటెడ్ మూవీ అని.. పదేళ్ల క్రితం రావాల్సిన సినిమా.. ఇప్పుడు చేశారని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Updated : 15 Aug 2023 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top