Home > సినిమా > మిస్టర్ ప్రెగ్నెంట్ స్టోరీ వినగానే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయా - నిర్మాత అప్పిరెడ్డి

మిస్టర్ ప్రెగ్నెంట్ స్టోరీ వినగానే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయా - నిర్మాత అప్పిరెడ్డి

మిస్టర్ ప్రెగ్నెంట్ స్టోరీ వినగానే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయా - నిర్మాత అప్పిరెడ్డి
X

మిస్టర్ ప్రెగ్నెంట్ తాను పర్సనల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమా అని నిర్మాత అప్పిరెడ్డి అన్నారు. మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నామని, ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేకపోవడంతో ఆ టైంలో మహిళలు పడే ఇబ్బందులు, కష్టం గురించి కళ్లారా చూశానని అప్పిరెడ్డి అన్నారు. 9 నెలలు ఇబ్బందులు పడి, నొప్పులు భరించి జన్మనిచ్చే శక్తి మహిళలకు మాత్రమే ఉంటుందని చెప్పారు.

డైరెక్టర్ మిస్టర్ ప్రెగ్నెంట్ స్టోరీ చెప్పిన వెంటనే కనెక్ట్ అయిపోయాయని అప్పిరెడ్డి చెప్పారు. స్క్రిప్ట్ ఛాలెంజింగ్ ఉండటంతో సినిమా చేయాలని డిసైడయ్యాయని అన్నారు. స్నేహితులు, బంధువులకు కథ చెప్పామని అది విన్న వారంతా బాగుందని, తప్పకుండా సినిమా చేయాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒక హీరో ప్రెగ్నెంట్ క్యారెక్టర్ చేయడం చాలా కష్టమని అయినా సోహెల్ ఛాలెంజ్గా తీసుకుని బాగా చేశాడని, హీరోయిన్ రూప కూడా బాగా నటించిందని అప్పి రెడ్డి చెప్పారు. సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చి తమను సపోర్ట్ చేసిన కింగ్ నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పారు. ఆగస్టు 18న రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరారు.

Updated : 5 Aug 2023 7:12 PM IST
Tags:    
Next Story
Share it
Top