Home > సినిమా > నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజ్‌ కారులో చోరీ..

నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజ్‌ కారులో చోరీ..

నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజ్‌ కారులో చోరీ..
X

ప్రముఖ నిర్మాత బెల్లండకొండ సురేష్ బెంజ్ కారులో చోరీ జరిగింది. నిలిపి ఉన్న కారు అద్దాలను పగలగొట్టి లోపల సొమ్మును కాజేశారు దుండగులు. సుమారు రూ.50 వేల నగదుతో పాటు ఖరీదైన 11 మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఒక్కో మద్యం సీసా ఖరీదు దాదాపు రూ.28 వేలు ఉండనున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తరువాత రోజు ఉదయం చోరీ జరిగిన విషయాన్ని బెల్లండ సురేష్ తెలుసుకున్నారు. ఆయన కార్యాలయం ఎదుటనే ఈ చోరీ జరగడం గమనార్హం. ఘటనపై బెల్లంకొండ సతీమణి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలు కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో టాలీవుడ్‌లో టాప్ నిర్మాతల్లో ఒకడిగా ఉన్న బెల్లంకొండ క్రమంగా సినిమాలను తగ్గించారు. కేవలం తమ కుమారులు బెల్లకొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ హీరోలుగా నటిస్తున్న సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. బెల్లంకొండ బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మీ నరసింహ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే ఎన్టీఆర్‌తో ‘రభస’, రామ్‌తో ‘కందిరీగ’ , రవితేజ తో నా ఆటోగ్రాఫ్ మూవీస్‌ సినిమాలను నిర్మించారు.


Updated : 10 Jun 2023 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top