Dil Raju: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం
Bharath | 9 Oct 2023 10:52 PM IST
X
X
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయనకు పితృవియోగం కలిగింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) సోమవారం సాయంత్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల వల్ల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందారు. ఇన్ని రోజులు పరిస్థితి బాగానే ఉన్నా.. ఇవాళ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి. శ్యామ్ సుందర్ రెడ్డికి దిల్ రాజుతో పాటు మరో కొడుకు కూడా ఉన్నారు.
Updated : 9 Oct 2023 10:52 PM IST
Tags: Producer Dil Raju Dil Raju Dil Raju father died shyam sunder reddy nizamabad cinema news movie news entertainment
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire