Home > సినిమా > రామ్ చరణ్ కొత్త మూవీ సాంగ్ లీక్.. క్రిమినల్ కేసు నమోదు..

రామ్ చరణ్ కొత్త మూవీ సాంగ్ లీక్.. క్రిమినల్ కేసు నమోదు..

రామ్ చరణ్ కొత్త మూవీ సాంగ్ లీక్.. క్రిమినల్ కేసు నమోదు..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్ లీక్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలోని ‘‘జరగండి.. జరగండి’’ అనే ఆడియో సాంగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నిర్మాత దిల్‌రాజు సీరియస్‌ అయ్యారు. సాంగ్‌ను లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్‍ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సాంగ్‌ను ఎవరు లీక్ చేశారో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో కోరారు. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ సాంగ్‌ను షేర్ చేసే వారిపైనా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.

కంప్లైంట్ పేపర్ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. ‘‘మా సినిమా గేమ్ ఛేంజర్ కంటెంట్‌ను లీక్‌ చేసిన వారిపై ఐపీసీ 66(c) కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశాం. చట్ట విరుద్ధంగా లీక్‌ అయిన నాసిరకం కంటెంట్ను వ్యాప్తి చేయొద్దు’’ అని ఈ పోస్టులో కోరింది. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్.జే. సూర్య, సముద్రఖని, నాజర్‌, నవీన్‌ చంద్ర సహా పలువురు నటులు కీలక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 16 Sept 2023 10:53 PM IST
Tags:    
Next Story
Share it
Top