Home > సినిమా > LEO MOVIE : లియోనే నా మొదటి, చివరి సినిమా

LEO MOVIE : లియోనే నా మొదటి, చివరి సినిమా

LEO MOVIE : లియోనే నా మొదటి, చివరి సినిమా
X

తెలుగు స్టార్స్ కు తమిళ్ లో పెద్దగా మార్కెట్ లేదు కానీ.. తమిళ్ స్టార్స్ కు మాత్రం తెలుగులో ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్ కోసం చాలాయేళ్లుగా ప్రయత్నించి ఈ దశాబ్దంలో సక్సెస్ అయిన హీరో విజయ్. తమిళ్ లో ఇళయ దళపతిగా తిరుగులేని క్రేజ్, మార్కెట్ ఉన్న విజయ్ సినిమాలు కొన్నాళ్లుగా తెలుగులోనూ ఆకట్టుకుంటున్నాయి. అందుకే కథల్లో కూడా మన ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పుల చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను నటించిన లియో ఈ నెల 19న తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ గురువారం విడుదలైన ట్రైలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినా యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే ఇదే తన చివరి సినిమా అంటున్నాడు నిర్మాత నాగవంశీ. లియో ఆయనకు చివరి సినిమా ఎలా అవుతుందీ అనుకుంటున్నారా.. ఎందుకంటే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది అతనే.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న నాగవంశీ ఫస్ట్ టైమ్ ఓ డబ్బింగ్ సినిమాను విడుదల చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. అతను నందమూరి బాలకృష్ణ అభిమానిని అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన సినిమా భగవంత్ కేసరిపైనే తన ఫస్ట్ డబ్బింగ్ సినిమాను వేస్తున్నాడు. అంటే తమ్ముడు తమ్ముడే అన్నట్టుగా ఉంది కదా.. ఖచ్చితంగా లియోపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అందుకు విజయ్ మాత్రమే కారణం కాదు.. విక్రమ్ తో తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా. దీనివల్ల బాలయ్య సినిమాకు భారీగా కాకపోయినా నష్టమైతే జరుగుతుంది అనేది కాదన్లేని సత్యం. సినిమా యాపారంలో ఈ సత్యాసత్యాలు ఎవరికి కావాలిలే గానీ.. ఇప్పుడు ఈ నాగవంశీ ఎందుకో డబ్బింగ్ సినిమా బాధలు ఒక్క సినిమాకే తెలుసుకున్నాడా లేక ఇంకేవైనా కారణాలున్నాయో కానీ.. ఇక తను రిలీజ్ చేసే ఫస్ట్ అండ్ లాస్ట్ డబ్బింగ్ మూవీ ఇదే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో ఈ మేరకు ఖచ్చితంగా చెప్పాడు. మరి ఆ మాట మీదే ఉంటాడా లేదా అనేది కాలమే చెబుతుంది.


Updated : 6 Oct 2023 5:21 PM IST
Tags:    
Next Story
Share it
Top