Guntur Kaaram: గుంటూరు కారంలో పూజా హెగ్డేను అందుకే తొలగించాం
X
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఇక ఇండస్ట్రీలో ఏ సినిమాకు రానన్ని రూమర్స్.. ఈ సినిమాకు వచ్చాయి. ముందుగా సినిమా కథ మారిందని, మ్యూజిక్ డైరెక్టర్ మార్చారని, రీ షూట్ చేశారని, సినిమా వాయిదా పడుతుందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిపై నిర్మాత నాగవంశీ ఇప్పటికే స్పందించాడు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా... గుంటూరు కారం నుంచి పూజా హెగ్డేను ఎందుకు తొలగించారో వివరించాడు.
‘ముందు ఆగస్ట్ 2023లో సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ 2023 జనవరికి రిలీజ్ డేట్ మార్చాం. చాలా గ్యాప్ ఉండటంతో షూటింగ్ నెమ్మదిగా పూర్తి చేయొచ్చులే అనుకున్నాం. అంతలో పూజకు ఓ హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. డేట్స్ సర్దుకోకపోవడంతో ఆమెను రీప్లేస్ చేశాం. దానికో కొందరు హంగామా చేశారు. రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ.. వార్తలు రాసుకొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ భిన్నంగా కనిపిస్తాడు. ప్రస్తుతం రెండు పాటలు సిద్ధం అయ్యాయి. ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేస్తాం. సంక్రాంతి బరిలో తప్పక ఉంటుంది’అని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ముందుగా పూజ హెగ్డే, శ్రీలీలను హీరోయిన్లుగా అనుకున్నారు. కానీ, పూజ తప్పుకోవడంతో మీనాక్షీ చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు.