సినిమా టికెట్ ధరలపై సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X
టాలీవుడ్ సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలై కొత్త ప్రతిపాదనలను సూచించారు. వారాంతల్లో ఒక విధంగా, వర్కింగ్ డేస్‌లో మరొకలా టికెట్ ధరలు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవర్సీ..బెంగుళూరు పట్టణాల తరహాలో ఉన్న పద్దతిని తెలుగు రాష్ట్రాల్లో అనుసరించాలని సూచించారు.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు మాట్లాడుతూ" టికెట్ రేట్లను సినిమా రిలీజైన మొదటి వారంలో పెంచేసి తర్వాత వారం తగ్గించేయడం కరెక్ట్ కాదు. అసలు టికెట్ రేట్లు పెంచడం, తగ్గించడం అనేది పూర్తిగా థియేటర్లకు వదిలేయాలి. అక్కడి పరిస్థితులు, వాతావరణం బట్టి థియేటర్లకు జనాలు రావడం, రాకపోవడం అనేది డిసైడ్ అవుతుంది. జనాలు ఎక్కువగా ఉండే ఏరియాల్లో.. థియేటర్లకు ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. టికెట్లు తగ్గించి, పెంచుకునే వెసులబాటు థియేటర్స్ కి ఇవ్వాలి. ఉదాహరణకు వీకెండ్లో టికెట్ రేట్లు 250 రూపాయలకు అమ్మితే, వీక్ డేస్ లో 150 రూపాయలకే పెట్టుకోవాలి" అని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.
వారమంతా పనిచేసి రిలాక్స్ కోసం థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకులకు మంచి ఆహారం,చక్కని అనుభూతి థియేటర్లు ఇవ్వాలని సూచించారు. ఇటీవల విడుదలైన జైలర్, గదర్, ఓఎంజీ2 చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించాయని సురేష్ బాబు తెలిపారు. వేసవిలో వచ్చిన నష్టాలను ఈ చిత్రాలు భర్తీ చేస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న కథలు దొరక్కపోవడంతో నిర్మాణాల్లో నెమ్మదించినట్లు చెప్పారు. రానా, అభిరామ్ తో త్వరలో సినిమాలు ఉంటాయని వెల్లడించారు.