Home > సినిమా > హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటంటే..

హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటంటే..

ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్‌కి కావాల్సింది!!

హాలీవుడ్ రేంజ్‌లో ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటంటే..
X


పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ 'ప్రాజెక్ట్ కే'(Project K) మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' అనే టైటిల్‌(Title Revealed)ను ఖరారు చేసింది మూవీ యూనిట్. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను అమెరికాలోని శాన్ డియాగోలోని కామిక్ కాన్ ( San Diego Comic Con)ఈవెంట్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ రిలీజ్ చేశారు. . అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌, హాలీవుడ్‌కు ధీటైన‌ గ్రాఫిక్స్ హంగుల‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ ఫ‌స్ట్‌ గ్లింప్స్ అభిమానుల‌ను మెస్మరైజ్ చేస్తున్నాయి.

'ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది' అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది.'వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కె' అనే ఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్‌(Prabhas ) లుక్‌ అదిరిపోయింది. కొంద‌రు దుష్ట‌శ‌క్తులు ప్ర‌జ‌ల‌ను బందీల‌ను చేయ‌డం, ఆ ప్ర‌జ‌లు ప‌డుతోన్న బాధ‌ల‌ను ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియో ఆరంభంలో చూపించారు. ఆ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టానికి ఉద్భ‌వించిన సూప‌ర్ హీరోగా ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చిన సీన్‌ ఫ‌స్ట్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ప్ర‌భాస్ లుక్‌, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తన్నాయి. చివ‌ర‌లో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ అనే ఓ వ్య‌క్తి అడ‌గ్గా వెంట‌నే టైటిల్ రివీల్ కావ‌డం ఆక‌ట్టుకుంటోంది.




ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌భాస్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌(Kamal Haasan ), ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌(Nag Ashwin), నిర్మాత అశ్వ‌నీద‌త్ పాల్గొన్నారు. ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ప్రాజెక్ట్ కే మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్(Amitabh Bachchan) కీల‌క పాత్రల‌ను పోషిస్తున్నారు.క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఫ‌స్ట్ గ్లింప్స్‌లో అత‌డిని చూపించ‌లేదు. ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌దుకొనే( Deepika Padukone) న‌టిస్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మ‌హాన‌టి త‌ర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంత‌రం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న మూవీ ఇది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు.

అమెరికాలో ప్రతిష్ఠాత్మక 'శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con)' వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లోనే ప్రాజెక్టు-కె మేకర్స్ గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమంలో ప్ర‌భాస్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌, నిర్మాత అశ్వ‌నీద‌త్ పాల్గొన్నారు. వీరితోపాటు హీరో రానాకు కూడా అక్కడకు వెళ్లారు.


Updated : 21 July 2023 7:41 AM IST
Tags:    
Next Story
Share it
Top