Home > సినిమా > మత విద్వేషాలను రెచ్చగొట్టేలా 'అమరన్'.. కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా 'అమరన్'.. కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అమరన్..  కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
X

విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న 'అమరన్' చిత్రం విడుదలను నిలిపివేయాలని తమిళనాడులో తమిళగ మక్కల్ జననాయక కట్చి (TMJK ) సభ్యులు నిరసన చేపట్టాడు. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్ లో ముస్లింలను అభ్యంతరకరంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రం టీజర్‌లో ముస్లింలను కించపరిచే విధంగా చిత్రీకరించారని TMJK సభ్యులు విమర్శించారు. టీజర్‌లో భారతీయ సైనికుడిని ముస్లిం వ్యక్తులు కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నట్లు చిత్రీకరించబడింది. దీంతో సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఆరోపిస్తూ టీఎంజేకే సభ్యులు కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'అమరన్'పై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. కమల్ మక్కల్ నీది మైయం పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు జోక్యం చేసుకుని, ఆందోళనకారులను చెదరగొట్టారు. మరికొందరిని అదుపులోకి సుకున్నారు.

నటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా 'అమరన్' ను నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీసినట్లు చెబుతున్నారు. రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ , హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 న సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కశ్మీర్‌లోని షాపియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. టెర్రరిస్టులు దేశాన్ని నాశనం చేయడం.. వారి నుంచి దేశాన్ని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అనేది సినిమాగా తెరకెక్కింది.

Updated : 22 Feb 2024 4:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top