రికార్డులను బద్దలు కొట్టిన పుష్ప2..ఆడియో రైట్స్‌కు అన్ని కోట్లా!
X
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జోడీగా నటించిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో దుమ్ముదులిపింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. దీంతో ఈ డిసెంబర్లో విడుదల కాబోతున్న పుష్ప2పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్‌ను మించి రెండో భాగం ఉండేలా అవుట్ పుట్ అందించే విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు సుకుమార్ . సినిమా షూటింగ్ దశలో ఉండగానే పుష్ప2 రికార్డుల వేటను మొదలెట్టేసింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ విషయంలో నయా రికార్డును సృష్టించింది.
పుష్ప సినిమాలోని అన్ని పాటలకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించి దేవీశ్రీ ప్రసాద్ మ్యాజిక్ చేశాడు. ప్రతి ఒక్కరు పుష్ప సినిమాలోని పాటను హమ్ చేసి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశారు. ఈ ఆడియోకు వచ్చిన స్పందనను చూసి ఇప్పుడు పుష్ప2 ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. సుమారు రూ.65 కోట్లకు టీ సిరీస్ కంపెనీ అన్ని భాషల్లోని ఆడియో రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.
భారతీయ సినీ ఇండస్ట్రీ హిస్టరీలో ఇన్ని కోట్లకు ఆడియో రికార్డ్స్ అమ్ముడుపోవడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన ఆర్ఆర్ఆర్ సినినమా ఆడియో రైట్స్‌కు రూ.30 కోట్లే వచ్చాయి. ఆ సినిమాతో పోలిస్తే డబుల్ ఇన్కమ్ పుష్ప2 తన ఖాతాలో వేసుకుంది.
డైరెక్టర్ సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ సూపర్‌హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా వరకు సినిమాలు సంగీతం పరంగా భారీ హిట్ అయ్యాయి. కెరీర్ ప్రారంభం నుంచి సుకుమార్ చిత్రాలకు డీఎస్‌పీనే అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. పుష్ప కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సినిమా పాటలో కేవలం తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో ‘నాటు నాటు’ పాట మినహా మరే పాటు అంతగా ఎవరికీ రిజిస్టర్ కాలేదు. కానీ పుష్పలో ప్రతి పాట భాషాతో సంబంధం లేకుండా సంగీత ప్రియుల్ని అలరించాయి. అందుకే పుష్ప2 ఆడియో రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఆడియో రైట్సే ఇన్ని కోట్లకు పోతే థియేటర్, ఓటీటీ హక్కులకు ఏ మాత్రం వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.