Home > సినిమా > Pushpa 2 : పుష్ప-2లో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్

Pushpa 2 : పుష్ప-2లో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్

Pushpa 2 : పుష్ప-2లో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మూవీలో సమంత చేసిన ఉ అంటావా మావా సాంగ్ ఓ రేంజ్‌లో హిట్టయ్యింది.సీక్వెల్‌లోను అలాంటి ఓ క్రేజీ పాట ఉందని టాక్. ఈ సాంగ్‌లో బన్నీ పక్కన నటిస్తున్నారంటూ పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై

సినిమా యాజమన్యం స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వీ ఎన్డీఆర్ సరసన నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది మరియు ఈ చిత్రం యొక్క ప్రత్యేక ఐటెమ్ నంబర్ గురించి న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. హాట్ హాట్ నటి జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి సంప్రదించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకి సినిమా ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు న్యూస్ వచ్చింది. అయితే ఆమె పారితోషకం 2 కోట్లు డిమాండ్ చేశారని మేకర్స్ ఆమె ఎంపిక నిలిపివేశారని తెలుస్తోంది.

ఈ సినిమా ఆగస్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 2లో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కనీస ప్రమోషన్ కార్యక్రమాలు చెయ్యకపోయినా గానీ అక్కడ ₹100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు, పాటలు ప్రపంచ సినిమా రంగాన్ని కుదిపేసాయి. దీంతో ఇప్పుడు “పుష్ప 2″…”పుష్ప ది రూల్” పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా అదే మాస్ మసాలా సాంగ్ దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి సుకుమార్ ప్లాన్ చేయడం జరిగిందట. ఈ క్రమంలో ఈ సాంగులో బాలీవుడ్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ చేత స్టెప్పులు వేయించినట్లు సమాచారం.

Updated : 1 March 2024 8:18 AM IST
Tags:    
Next Story
Share it
Top