Home > సినిమా > 'పుష్ప-2' రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్

'పుష్ప-2' రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్

పుష్ప-2 రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
X

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ఫ-2 మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ మూవీ మేకర్స్ సినిమాను 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే పుష్ప మూవీలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ అవ్వడంతో ఆ మూవీ అనుకున్న సమయానికి విడుదల కాదని అనుకున్నారు. సినిమా విడుదల వాయిదాపై జోరుగానే ప్రచారం సాగింది.

గత కొద్దిరోజుల నుంచి పుష్ప-2 మూవీ వాయిదా పడుతుందని సినీ వర్గాలన్నీ అనుకున్నాయి. అయితే ముందుగా ప్రకటించిన తేదీలోనే సినిమా విడుదల అవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. 2024 ఆగస్టు 15వ తేదీనే పుష్ప గాడు థియేటర్లలో కనిపిస్తాడని మూవీ మేకర్స్ ప్రకటించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 2021లోనే పుష్ప ది రైజ్ మూవీ విడుదలై భారీ వసూళ్లను సాధించింది.

పుష్ప మూవీలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర ఎంతో ఫేమస్ అయ్యింది. అలాగే ఇందులో ఫహద్ ఫాజిల్ నెగిటివ్ షెడ్స్‌లో కనిపించాడు. మొదటి పార్ట్‌లో ఆయన తక్కువ సమయమే కనిపించినా రెండో పార్ట్‌లో ఆయన ఎక్కువసేపు ఉంటాడని మేకర్స్ తెలిపారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించే పాటలు అద్భుతంగా ఉంటాయని మేకర్స్ ప్రకటించారు. పుష్ప పార్ట్1కు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డులు అందుకున్న తర్వాత మరింత జోష్‌తో వాళ్లిద్దరూ పనిచేస్తున్నారని మేకర్స్ తెలిపారు.


Updated : 26 Jan 2024 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top