Home > సినిమా > పుష్ప 2 అప్డేట్.. ఫాహద్ ఫాసిల్ లుక్ రిలీజ్

పుష్ప 2 అప్డేట్.. ఫాహద్ ఫాసిల్ లుక్ రిలీజ్

పుష్ప 2 అప్డేట్.. ఫాహద్ ఫాసిల్ లుక్ రిలీజ్
X

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘పుష్ప 2’ షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. షూట్ లో అల్లు అర్జున్‌ తో పాటు ఫాహద్ ఫాసిల్ మరియు సునీల్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ముఖ్యంగా ఈ షెడ్యూల్ లో సుకుమార్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశాడట.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో పోలీసు అధికారి పాత్రలో భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించిన ఫాహద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు ఫాహద్ బర్త్ డే కావడంతో.. మేకర్స్ విషెస్ తెలియజేస్తూ .. పోస్టర్ ను ట్వీట్ చేశారు. పుష్ప సినిమాలో ఫాహద్ యాక్టింగ్ అదరగొట్టాడు. అల్లు అర్జున్ తో పోటీ పడి క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఇక పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్నారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Updated : 8 Aug 2023 11:24 AM IST
Tags:    
Next Story
Share it
Top