Home > సినిమా > Allu Arjun : పుష్ప పార్ట్ 3 ఉంటుంది.. బన్నీ కామెంట్స్

Allu Arjun : పుష్ప పార్ట్ 3 ఉంటుంది.. బన్నీ కామెంట్స్

Allu Arjun  : పుష్ప పార్ట్ 3 ఉంటుంది.. బన్నీ కామెంట్స్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీ పుష్ప-2 సినిమా షుటింగ్ జపాన్‌లో జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో జపాన్‌లోని ఓ ఇంటర్నేషన్ ఛానల్‌లో పుష్ప-2 గురించి బన్నీ మాట్లాడారు. మొదటి పార్ట్ కంటే రెండోది అద్బుతంగా ఉంటుందన్నారు. అలాగే మీరు పార్ట్‌ని కూడా ఆశించవచ్చు అని హింట్ ఇచ్చారు. అయితెే ఈ పుష్ప-2 ఆగస్టు15కు విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్‌ని పాన్‌ ఇండియా స్టార్‌గా, డైరెక్టర్‌గా నిలిపిన సినిమా పుష్ప. సౌత్‌లోనే కాక ఉత్తరాదిలో కూడా భారీ విజయం సాధించి.. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది పుష్ప చిత్రం. ఈ మూవీలోని పాటలు అప్పట్లో దేశాన్ని ఓ ఊపు ఊపాయి. పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ మూవీ ప్లానింగ్ మొత్తం మారిపోయింది.





ఎందుకంటే పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తానని ప్రటించాడు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 సడెన్‌గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. అంతేకాక పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో కాకుండా డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. పుష్ప 2 రిలీజ్‌ తర్వాత.. అట్లీతో ప్రాజెక్ట్ చేస్తే పాన్ ఇండియా లెవల్లో తన క్రేజ్‌ మరింత పెరుగుతుందని భావిస్తున్నాడట బన్నీ. మొత్తానికి పుష్ప 3 పార్ట్‌ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. పుష్పలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ పుష్ప 2లో కూడా ఉండనున్నాయి. వీటితో పాటు మరిన్ని క్యారెక్టర్స్ జత చేరనున్నాయని తెలుస్తుంది. సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి అన్ని భాషల యాక్టర్స్ ని సుకుమార్ తీసుకురానున్నాడట. తాజాగా ఫహద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాకి పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.




Updated : 17 Feb 2024 6:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top