Home > సినిమా > Pushpa2 The Rule : 200 రోజుల్లో 'పుష్ప' రూల్ బిగెన్..పోస్టర్ రిలీజ్

Pushpa2 The Rule : 200 రోజుల్లో 'పుష్ప' రూల్ బిగెన్..పోస్టర్ రిలీజ్

Pushpa2 The Rule : 200 రోజుల్లో పుష్ప రూల్ బిగెన్..పోస్టర్ రిలీజ్
X

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప2 మూవీకి సంబంధించి మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు. పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ మరో 200 రోజుల్లో పుష్పగాడి రూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ మూవీకి కొనసాగింపుగా పుష్ప2 విడుదల కానుంది. పుష్ప2..ది రూల్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప..ది రైజ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రానుంది.

పుష్ప2 మూవీలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్పరాజ్‌గా మరోసారి అందర్నీ ఎంటర్‌టైన్ చేయనున్నాడు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఇక పుష్పరాజ్ తన రూల్ ప్రారంభించేందుకు ఇంకో 200 రోజులు మిగిలి ఉందని చెబుతూ మూవీ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఓ కొండపై పులి కనిపిస్తోంది. అంటే పుష్పరాజ్ పులుల మధ్య ఉండి తన వ్యాపారాన్ని విస్తరిస్తాడనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్‌ మరింత ఉర్రూతలూగిస్తుందని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీలోని సాంగ్స్ అదిరిపోయాయని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



Updated : 29 Jan 2024 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top