Allu Arjun National Film Awards : పోరంబోకులం.. రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నాం.. అల్లు అర్జున్
X
‘తగ్గేదేలే’ అంటూ పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టైలిష్ స్టార్ తాను ఒకప్పుడు పోరంకోకునని చెప్పాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా పోరంబోకేనని అన్నాడు. ఒకప్పుడు ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేని తామిద్దరం అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి నుంచి పురస్కారాలు అందుకున్నామని చెప్పారు. 'పుష్ప' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఇటీవల అవార్డులు అందుకున్నారు. జాతీయ అవార్డు విజేతలకు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ శనివారం హైదరాబాద్‌లో ఇచ్చిన విందులో బన్నీ పై వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తను, దేవిశ్రీ ప్రసాద్ పోరంబోకులుగా ఉండేవాళ్లమన్నాడు.
‘‘నాకు, దేవీకి అవార్డు వచ్చినందుకు మా నాన్న ఎంతో సంతోషించాడు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్టు ఉందన్నారు. దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి ఈ రోజు మన మధ్య లేకపోయినా అతడూ తన బిడ్డలాంటి వాడే అని మా నాన్నా భావించాడు. అతడు అవార్డు అందుకోవడాన్ని చూడ్డానికి ఢిల్లీ వచ్చాడు. అప్పుడు నేను మా నాన్నతో ఓ మాట చెప్పాను. ‘నాన్నా నీ భాషలో చెప్పాలంటే మేం చెన్నైలోని ఇద్దరు పోరంబోకులం. కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద సర్టిఫికెట్లు కూడా తీసుకోనివాళ్లం. ఇప్పుడే ఏకంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పతకం అందుకుంటామని నువ్వు అనుకున్నావా? అని అడిగాను’ అని అడిగాను’’ అని అల్లు అర్జున్ చెప్పాడు. దీంతో పక్కన ఉన్న దేవిశ్రీ సహా ప్రేక్షకులు భళ్లుమని నవ్వారు.