PV Sindhu : టాలీవుడ్ హీరో సినిమాలపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్
X
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివీ సింధు గురించి అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో, ఎన్నో టోర్నమెంట్లలో ఆమె మెడల్స్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఎంతో పాపులారిటీని తెచ్చుకుంది. తెలుగు అమ్మాయి అయిన పీవీ సింధుకు సినీ పరిశ్రమలో కూడా పరిచయాలున్నాయి. సినిమావాళ్ల పార్టీలల్లో ఆమె అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పీవీ సింధు సినిమాలపై, టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్వ్యూలో పీవీ సింధు మాట్లాడుతూ..బ్యాడ్మింటన్‌లో ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువగా సినిమాలు చూస్తానని చెప్పుకొచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకు క్రష్ అని, రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. తనకు ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో నచ్చిందన్నారు. తనకు మెడల్ వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి పిలిచి అభినందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. విజయ దేవరకొండ సినిమాలు చూశారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ చేశారు.
విజయ్ దేవరకొండ సినిమాల్లో తనకు కొన్ని మాత్రమే నచ్చాయని, ఇంకొన్ని అస్సలు నచ్చలేదని చెప్పింది. ఆ విషయం చెబితే మళ్లీ కాంట్రవర్సీలు అవుతాయని, తనకు నచ్చని సినిమాలు వేరేవారికి నచ్చొచ్చని పీవీ సింధు చెప్పుకొచ్చారు. సినిమాలు కూడా చాలా కష్టం అని, నెలల తరబడి షూటింగ్స్ చేసినా అది హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో తెలీదని, వాళ్లపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని సింధు అన్నారు. ప్రస్తుతం పీవీ సింధు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.