సినిమా ప్రియులకు శుభవార్త.. రూ.700లకే నెలంతా సినిమాలు
X
మన భారతీయులకు సినిమా ఎంటర్ టైన్మెంట్ కాదు.. సినిమా అంటే ఒక ఎమోషన్. అందులో ఎలాంటి ఎమోషన్ లో ఉన్నా.. సినిమాలకు వెళ్లి చిల్ అవుతుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఇదివరకు ఒక సినిమాను కనీసం మూడు నాలుగు సార్లు చూసేవాళ్లు. కానీ, పెరిగిన సినిమా టికెట్ రేట్లు.. బిజీ లైఫ్ వల్ల చాలామంది.. ఒక్కసారి సినిమాకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సినిమా ప్రియులకు శుభవార్త. ప్రేక్షకులను తిరిగి సినిమా హాళ్లకు రప్పించడానికి ఒక కొత్త ఆఫర్ ను తీసుకొచ్చారు పీవీఆర్ ఐనాక్స్. కేవలం రూ.699లకే మల్టీప్లెక్స్ లో నెలంతా సినిమా టికెట్ పొందే సువర్ణ అవకాశం కల్పించారు.
అందులో భాగంగా ప్రేక్షకుల కోసం మూవీ పాస్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం నార్త్ లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. సౌత్ లో ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఈ పాస్ ద్వారా నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే ఓ కండీషన్ ఉంది. అదేంటంటే.. ఈ పాస్ తో సోమ నుంచి గురువారాల్లో మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్ లో ఈ పాస్ చెల్లదు. పీవీఆర్ మూవీ పాస్ కు సంబంధించి ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్ మొదలు కాగా.. పాస్ లు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే సంక్రాంతి సీజన్ తర్వాత ఈ పాస్ ను అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తుంది. ఈ పాస్ కావాలంటే.. https://passport.pvrinox.com/లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.