Matti Katha Movie : మట్టికథకు ప్రేక్షకుల బ్రహ్మరథం.. షోలను పొడిగించిన పీవీఆర్ మల్టిప్లెక్స్..
X
అచ్చమైన పల్లె సినిమా మట్టికథ థియేటర్స్‌లో ప్రేక్షకుల గుండెలను తట్టిలేపుతోంది. మట్టికథ మనసుకు హత్తుకునే కథ అంటూ ఆడియన్స్ చెప్పడం ఈ సినిమా నిజమైన గెలుపు. తమకు కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. ఈ క్రమంలో పీవీఆర్ మల్టిప్లెక్స్ సినిమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజులు ఈ సినిమా షోస్ను పొడిగించాలని నిర్ణయించింది.
మూడు రోజుల పాటు మట్టికథ షోలను పీవీఆర్ మల్టీప్లెక్స్ పొడిగించింది. పబ్లిక్ మౌత్ టాక్తో పాటు బుక్ మై షోలో అదిరిపోయే రేటింగ్స్ రావడంతో పీవీఆర్ మల్టీప్లెక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో ఈ షోలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ఆడుతున్న అన్నీ థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అటు థియేటర్స్ను పెంచాలనే డిమాంట్లు కూడా ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. విలేజ్ డ్రామా బ్లాక్‌బస్టర్ అంటూ ప్రముఖ ప్లాట్ఫార్మ్స్ కూడా మట్టికథకు మంచి రేటింగ్స్ ఇచ్చాయి.
తెలంగాణ సంస్కృతి, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవిన విధానాన్ని, స్వచ్ఛమైన మనుషుల మనసులను, భూమే ప్రాణంగా, వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికే ప్రజల భావోద్వేగాలను స్పష్టంగా చూపిస్తుంది `మట్టి కథ`. అన్నీ ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు. విడుదలకు ఈ మూవీ అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇండో - ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 9 అవార్డులతో వారెవ్వా అనిపించింది.
ఇక ఈ మూవీని పవన్ కడియాల డైరెక్ట్ చేయగా.. మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాతగా వ్యవహరించగా.. స్మరణ్ సాయి అదిరిపోయే సంగీతం అందించారు. ఈ మూవీ మ్యూజిక్ మనసుకు హత్తుకుంటుంది. పవన్ కడియాల తొలి చిత్రమే అయినా చాలా రియలిస్టిక్‌గా అనుభవమున్న వ్యక్తిలా కథను మలిచారు. అజయ్ వేద్, అక్షయ్ సాయి, రాజు ఆలూరి, బత్తుల తేజ, బల్వీర్ సింగ్, మాయ, రుచిత నిహాని, కనకవ్వ, బలగం సుధాకర్ రెడ్డి, దయానంద్ తమ సహజ నటనతో అదరగొట్టారు. సినిమా అంటే కమర్షియల్ అనే భావనకు వెళ్లకుండా రియాలిటీగా దగ్గరగా మట్టికథను తీసి తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ మూవీ అందించారు మేకర్స్ను ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.