Home > సినిమా > టిల్లు స్క్వేర్లో రాధిక స్పెషల్ ఎంట్రీ.. అనుపమ చెల్లిగా!

టిల్లు స్క్వేర్లో రాధిక స్పెషల్ ఎంట్రీ.. అనుపమ చెల్లిగా!

టిల్లు స్క్వేర్లో రాధిక స్పెషల్ ఎంట్రీ.. అనుపమ చెల్లిగా!
X

గతేడాది చిన్న సినిమాగా రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న సినిమా డీజే టిల్లు. రోమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చిన ఈ సినిమాలో సిద్ధు జొన్నల గడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘టిల్లు స్వ్కేర్’ రామ్ మల్లిక్ డైరెక్షన్ లో రూపొందుతుంది. ఈ సినిమాలో సిద్దు సరసన అనుమప పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ మల్లిక్ షాకింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో ‘డీజే టిల్లు’లో నటించిన రాధిక క్యారెక్టర్.. స్పెషల్ ఎంట్రీ ఇవ్వనుంది. ‘టిల్లు మోసం చేసిన రాధిక.. జైల్ నుంచి రిలీజ్ అయి హీరో దగ్గరికి తిరిగొస్తుంది. రాధిక అక్కే అనుపమ. తన చెల్లిని జైల్ కు పంపిన టిల్లుపై రివేంజ్ తీసుకోవడానికి మళ్లీ అతని లైఫ్ లోకి వస్తుంది. అక్కా చెల్లెల్లిద్దరు కలిసి.. ఎలాంటి రివేంజ్ తీసుకున్నారు. చివర్లో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి. టిల్లు వాటిని ఎలా ఎదుర్కుంటాడు అనేది కథ’ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. రాధిక ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లో రెస్పాన్స్ మాములుగా ఉండదని ట్వీట్స్ చేస్తున్నారు.



Updated : 23 Aug 2023 4:41 PM IST
Tags:    
Next Story
Share it
Top