Kallapu Lishi Ganesh : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తెలుగు నటి
X
(Kallapu Lishi Ganesh) రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో యూట్యూబ్ నటి కల్లపు లిషి గణేశ్ పేరు తెర మీదకు వచ్చింది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన లిషిని ఈ కేసులో పోలీసులు నిందితురాలిగా చేర్చినట్టు సమాచారం. బీజేపీ నేత గజ్జల వివేకనంద ఏర్పాటు చేసిన ఈ డ్రగ్స్ పార్టీకి లిషి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమెను విచారించనున్నట్టు సమాచారం. 2022 డ్రగ్స్ కేసులో లిషితో పాటు ఆమె సోదరి పేరు కూడా వినిపించింది. యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు.
హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. కొకైన్ పార్టీ వ్యవహారంలో మంజీరా గ్రూప్ డైరెక్టర్ జి. వివేకానందను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి చెప్పారు. అతనితో పాటు నిర్భయ్, కేదార్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాము నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ పై తాము కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. ఇక్కడి నిందితులకు సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్మినట్లు తెలిసిందని సీపీ వివరించారు. అతని కోసం వెతుకుతున్నామని.. వారు డేటాని డిలీట్ చేసినా.. రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పట్టుబడిన వారిలో వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడని సీపీ చెప్పారు. ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని అన్నారు. డ్రగ్స్ టెస్ట్ లో వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్ కు కూడా పాజిటివ్ వచ్చిందని అన్నారు. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించగా.. కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందని సీపీ తెలిపారు.