Home > సినిమా > మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి, రాఘవ్
X

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో వీరి పెండ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో పాటుగా పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా సాగింది. అయితే పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు.

రాఘవ్ పరిణీతిల పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరు కాలేదు. ఆమె తల్లి అటెండ్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలిపింది.

సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో పరిణీతి, రాఘవ్ల రిసెప్షన్‌ను జరగనుంది. ఈ కొత్త జంట వచ్చే నెలలో ఢిల్లీలో మరో రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది. పొలిటికల్ లీడర్లు, సినీ సెలబ్రిటీల కోసం ఢిల్లీలో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మధ్య పరిచయం లండన్‌లో మొదలైంది. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా క‌లిసి చ‌దువుకున్నారు. కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మ‌ధ్య జరిగిన ప‌రిచ‌యం స్నేహంగా ఆ తర్వాత ప్రేమ‌గా మారింది. ఈ ఏడాది మార్చి నుంచి పరిణీతి, రాఘవ్ పెళ్లి రూమర్స్ వినిపించాయి. తాజాగా వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2022లో 33 ఏండ్ల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ నుంచి అతి చిన్న వయస్కుడైన ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

Updated : 24 Sept 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top