Home > సినిమా > చంద్రముఖి ఈజ్ బ్యాక్..18 ఏళ్ల తరువాత వస్తున్న సీక్వెల్

చంద్రముఖి ఈజ్ బ్యాక్..18 ఏళ్ల తరువాత వస్తున్న సీక్వెల్

చంద్రముఖి ఈజ్ బ్యాక్..18 ఏళ్ల తరువాత వస్తున్న సీక్వెల్
X

2005లో విడుదలైన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతారలు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికీ వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‎తో వచ్చిన ఈ సినిమా చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. చంద్రముఖిని డైరెక్ట్ చేసిన పి.వాసు ఆ తరువాత సీక్వెల్‎కు ప్రయత్నించారు. కానీ అది అలా పెండింగ్ పడుతూనే వచ్చింది. సీక్వెల్ పార్ట్‎ను రజనీకాంత్‎తోనే తీయాలనుకున్నారు. కానీ రజనీ అందుకు ఒప్పుకోలేదు. సీక్వెల్ కథతో డైరెక్టర్ తెలుగులో నాగవల్లి సినిమా చేశారు.


ఎట్టకేలకు 19 ఏళ్ల తరువాత తమిళంలోనే చంద్రముఖి 2 సినిమా పూర్తి చేశారు డైరెక్టర్ వాసు. అయితే రెండో భాగంలో రజనీకాంత్‌కు బదులుగా కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్‌ కనిపించనున్నాడు. ఇక చంద్రముఖి పాత్రలో బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్, నటి కంగనా రనౌత్‌ నటించనుంది. వీరితో పాటు వడివేలు, రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మధ్యనే సీక్వెల్ పార్ట్ షూటింగ్‌ పూర్తైంది. సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఈ క్రమంలో లారెన్స్ తన ట్విటర్ అకౌంట్‎లో చంద్రముఖి సినిమా పోస్టర్లను షేర్ చేసి సినిమా రిలీజ్ డేట్స్‎ను కన్ఫార్మ్ చేశాడు. ఈ వినాయక చవితికి చంద్రముఖి2 ప్రేక్షకుల ముందకు రాబోతోందని అధికారికంగా ప్రకటించాడు. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దీంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ కాంచన సినిమా సీక్వెన్స్‎తో ప్రేక్షకులను ఏమేరకు భయపెట్టాడో అందరికీ తెలిసింది. దీంతో ఇప్పుడు చంద్రముఖి2పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.



Updated : 30 Jun 2023 10:30 AM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top