Raghava Lawrence : రజినీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్
X
సూపర్ స్టార్ హీరో, తలైవా రజినీకాంత్ అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. సౌత్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ వేరే లెవెల్. సెలబ్రిటీలు కూడా ఆయన్ని ఎంతో అభిమానిస్తారు. (Raghava Lawrence Take From Rajinikanth) ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌కు రజనీకాంత్ అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో లారెన్స్ స్వయంగా చెప్పారు. తాజాగా మరోసారి రజినీకాంత్ అంటే తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చూపించారు లారెన్స్. చంద్రముఖి2 రిలీజ్ సందర్భంగా లారెన్స్ స్వయంగా రజినీకాంత్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. రజినీకాంత్ కాళ్లకు దండం పెట్టి తన గురుభక్తిని చూపించారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
"హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్..నేను ఈ రోజు తలైవ, నా గురువు రజినీకాంత్‌ని కలిశాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 28న నా సినిమా చంద్రముఖి2 విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. అలాగే ఆయన నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌కు శుభాకాంక్షలు తెలిపాను. రజినీకాంత్ ఎప్పుడూ గొప్పవారే. గురు శరణం" అంటూ ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు లారెన్స్ .
అప్పట్లో సూపర్ హిట్ అయిన రజినీకాంత్, జ్యోతిక, నయనతార నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న మూవీ చంద్రముఖి 2. ఈ సినిమాకు డైరెక్టర్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రాఘవ లారెన్స్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.