Home > సినిమా > చంద్రముఖి 2’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. నేడే ఆడియో లాంఛ్

చంద్రముఖి 2’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. నేడే ఆడియో లాంఛ్

చంద్రముఖి 2’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. నేడే ఆడియో లాంఛ్
X

2004 లో రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రాబోతున్న విషయం తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌లో ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యేదుంకు సిద్ధంగా ఉంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌‌లో జోరు పెంచింది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ స్వాగతాంజలి సాంగ్‌తోపాటు సెకండ్‌ సింగిల్‌ Moruniyeకు మంచి స్పందన వస్తోంది.





ఇక ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను శుక్రవారం నిర్వహించనున్నట్టు తెలియజేస్తూ.. కొత్త లుక్ అందరితో షేర్ చేసుకున్నాడు హీరో రాఘవ. ఇప్పుడీ లుక్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈవెంట్‌ నేపథ్యంలో మీ ఆశీస్సులు కావాలని అభిమానులను, శ్రేయోభిలాషులు, మూవీ లవర్స్‌ను కోరాడు. ఈ సినిమాకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, టైటిల్ లుక్ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చంద్రముఖి 2లో లెజెండ‌రీ కమెడియ‌న్ వడివేలు కీ రోల్‌లో నటిస్తున్నాడు. చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.




Updated : 25 Aug 2023 1:38 PM IST
Tags:    
Next Story
Share it
Top