Home > సినిమా > ఆర్సీ 16 మూవీకి ఎ ఆర్ రహమాన్ మ్యూిజక్ కన్ఫార్మ్

ఆర్సీ 16 మూవీకి ఎ ఆర్ రహమాన్ మ్యూిజక్ కన్ఫార్మ్

ఆర్సీ 16 మూవీకి ఎ ఆర్ రహమాన్ మ్యూిజక్ కన్ఫార్మ్
X

రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రస్తుతానికి ఆర్సీ 16గా పిలుస్తున్న ఈ సినిమాకు క్యాస్టింగ్ ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. దీనికి ఏార్ రహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.

ఆర్సీ16 సినిమాలో హీరోయిన్లుగా జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ లను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాని స్వయంగా ఏఆర్ రహమానే అనౌన్స్ చేశారు. ఓ గొప్ప సబ్జెక్ట్ కి రామ్ చరణ్ కోసం మ్యూజిక్ అందిచబోతున్నట్లు రహమాన్ ప్రకటించారు. అందుకుగానూ రహమాన్ తన కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆర్సీ 16 కోసం రహమాన్ 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

రెహమాన్ చివరిసారిగా తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో కి సంగీతాన్ని అందించారు. అంతకు ముందు కొమరం పులికి చేశారు. రహమాన్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ గా సెన్సేషనల్ సాధించారు. ప్రపంచదేశాలు ఆయన చేత మ్యూజిక్ చేయించుకోవడం కోసం ఎదురు చూస్తుంటాయి. మరి అలాంటి సంగీత దర్శకుడి రెమ్యునరేషన్ రూడా ఎక్కువే ఉంటుంది. దాని ఫలితమే 15 కోట్లు అంటున్నారు. 2016లో చివరిసారిగా తెలుగు సినిమాకు మ్యూజిక్ అందించిన రహమాన్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత చేస్తున్నారు.



Updated : 13 July 2023 11:21 AM IST
Tags:    
Next Story
Share it
Top