Home > సినిమా > ఘోర రైలు ప్రమాదంపై కమెడియన్ జోకులు.. తిట్టిపోసిన నెటిజన్లు

ఘోర రైలు ప్రమాదంపై కమెడియన్ జోకులు.. తిట్టిపోసిన నెటిజన్లు

ఘోర రైలు ప్రమాదంపై కమెడియన్ జోకులు.. తిట్టిపోసిన నెటిజన్లు
X


ఒడిశా రైలు ప్రమాదం.. ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటున్న విషాద వార్త. వేలాది ప్రయాణికులతో వెళ్తున్న మూడు రైళ్లు ఒకదానికొకటి ‘ఢీ’ కొనడంతో... 280 మందికి పైగా ప్రయాణికులు మృత్యవాత పడ్డారు. వేల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంతోమంది ఒడిషా వాసులు తమ వంతు సాయంగా మానవత్వంతో ఆసుపత్రిలో చేర్పించగా... వేల సంఖ్యలో రక్తదానం చేసేందుకు స్వచ్ఛంధంగా ముందుకొచ్చారు మరికొందరు. యావత్ దేశమంతా క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తూ.. మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నది. ఇటువంటి సమయంలో టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ రైలు ప్రమాదంపై అనుచిత ట్వీట్‌ చేసి, అందరి చేత చివాట్లు తిన్నాడు.




‘సైలెంట్‌’ అనే హాలీవుడ్‌ మువీలో ఓ ట్రైన్‌ సీన్‌ను షేర్‌ చేశాడు. నటుడు బస్టర్‌ కీటన్‌ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో అది. ఈ ట్వీట్‌ షేర్‌ చేసిన వెంటనే నెటిజన్లు రాహుల్‌ రామకృష్ణపై ఫైర్‌ అవుతున్నారు. ఒడిశా రైలు ప్రమాదంతో ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? ఇది కామెడీ చేసే సమయమా?, కొన్ని వందల కుటుంబాలు ట్రైన్‌ యాక్సిడెంట్‌లో సమాధి అయిపోతే నీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్‌ చేస్తున్నావా? అని పలువురు మండిపడ్డారు.

https://twitter.com/eyrahul/status/1664773719946846217

వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్‌ సదరు ట్వీట్‌ డిలీట్‌ చేశాడు. మరో ట్వీట్ లో ... ‘ఇంతకు ముందు నేను చేసిన ట్వీట్‌పై క్షమాపణలు కోరుతున్నాను. ఆ విషాదం గురించి నాకసలు తెలియదు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్‌ రాసుకునే పనిలో ఉన్నాను. నేను న్యూస్ చూడలేదు. అందుకే తప్పు జరిగింది. ప్రామిస్‌.. ఇది కావాలని చేసింది కాదు..’ అంటూ క్షమాపణలు తెలిపాడు. ఇక నెటిజన్లు కూడా రాహుల్‌ తప్పిదాన్ని క్షమించేశారు. ‘మిమ్మల్ని విమర్శించాలని కాదు. మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాం. మేము కేవలం ఆ ఘటన తీవ్రత గురించి తెలియజేయాలనుకున్నాం’ అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. దీనికి రాహుల్‌ రిప్లై ఇస్తూ.. ‘థాంక్యూ.. గత కొన్ని గంటలుగా నేను న్యూస్‌ ఫాలో అవడం లేదు. నా పనిపైనే ఫోకస్‌ చేశాను. నన్ను అలర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.




Updated : 4 Jun 2023 7:49 AM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top