Bigg boss 7: రాహుల్-రతిక ప్రైవేట్ ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్
X
బిగ్ బాస్ 7లో తన బ్యూటీతో అలరిస్తుంది రతిక. మొదట్లో కాస్త డల్ గా కనిపించినా.. తర్వాత హౌస్ మేట్స్ అందరితో కలిసి రచ్చ మొదలుపెట్టింది. అటు పల్లవి ప్రశాంత్.. ఇటు ప్రిన్స్ యావర్ తో కలిసి ట్రాక్ నడిపిస్తూ ఆడియన్స్ కు కావాల్సిన మజాను అందిస్తుంది. అయితే బిగ్ బాస్ కు రాకముందు రతిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లవ్ లో ఉన్నారని, ఆ విషయాన్ని నాగార్జున బయటపెట్టాడు. దాంతో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. ఈ న్యూస్ బయటికి రావడం ఆలస్యం.. నెట్ లో ఈ ఇద్దరు కలిసి క్లోజ్ గా ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫొటోలు ఉన్నఫలంగా లీక్ కావడంపై రాహుల్ సిప్లిగంజ్ ఫైర్ అయ్యాడు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రతికపై మండిపడ్డాడు. సింపతీ కోసం ఈ గేమ్స్ ఆడుతుందని కావాలనే ఫొటోలు లీక్ చేస్తుందంటూ ఆరోపించాడు.
‘ఆరేళ్ల తర్వాత పర్సనల్ ఫోన్ నుంచి ఫొటోలు ఎలా బయటికి వస్తాయి? ప్రతి ఒక్కరికీ కుటుంబం, లైఫ్ ఉంటుందని ఆలోచించాల్సి ఉంటుంది. ఫేమ్ పొందడానికి ఫొటోలు లీక్ చేస్తున్నారు. పెయిడ్ బ్యాచ్ ను పెట్టి నడిపిస్తున్నారు. నాకు ఎవరి లైఫ్ తో ఆడుకోవాలని లేదు. అలాగని అనవసరంగా నా లైఫ్ ను రిస్క్ లో పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే లైఫ్ లో పైకి రావడానికి వాళ్ల జీవితంలో చాలా కష్టపడుతుంటారు. ఇలాంటి పనులు చేసేముందు ఆ వ్యక్తి, అతని ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించాలి. ప్రతీ ఒక్కరికి పాస్ట్ ఉంటుంది. అందులో నిజం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఏదేమైనా ఎవరైతే నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారో వాళ్లకు ఆల్ ది బెస్ట్’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.