ఎన్నికల బరిలో రాహుల్ సిప్లిగంజ్.. అక్కడ నుంచే పోటీ..
X
పాతబస్తీ పోరగాడు పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఇన్నాళ్లు గాత్రంతో జనాన్ని మెస్మరైజ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పాడు ప్రజల గొంతుకగా మారేందుకు సిద్ధమయ్యాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ సిప్లింగంజ్ బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత, ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాట పాడి వరల్డ్ ఫేమస్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పొటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. పక్కా తెలంగాణ యాసలో మాట్లాడే ఈ మంగళ్ హాట్ ముద్దుబిడ్డ ఈసారి గోషా మహల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నాడు. కాంగ్రెస్ పెద్దలతో చర్చల అనంతరం ఆయన ఆ టికెట్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రాహుల్ గోషామహల్‌కు సరైన అభ్యర్థిగా కాంగ్రెస్ సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ యాస, నాటు పాటలతో హైదరాబాదీ స్టైల్‌ను ప్రపంచవ్యాప్తం చేసిన రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ పెరిగింది. మరోవైపు కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఏరికోరి ఆయనను ఎంపిక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడించినట్లు తెలుస్తోంది. గోషామహల్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, సున్నిత అంశాలపై వివాదాలతో స్థానికులు విసిగిపోయారు.ఈ క్రమంలో పక్కా హైదరాబాదీ బ్రాండ్ మంగళహాట్ పోరగాడు గోషామహల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.
2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల కారణంగా రాజాసింగ్పై వేటు వేసిన బీజేపీ ఇప్పటి వరకు ఆయన సస్పెన్షన్ తొలగించలేదు. దీంతో బీజేపీ ఈసారి ఆయనకు టికెట్ ఇస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో గోషా మహల్ కూడా ఒకటి. దీంతో ప్రధాన పార్టీలన్నీ గోషా మహల్పై ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ గోషా మహల్ విన్నర్ గా నిలుస్తారా లేదా అన్నది మరో 4 నెలల్లో తేలనుంది.