Home > సినిమా > Bigg boss 7: ఇన్స్టాలో రతికకు ఇచ్చినడేసిన రాహుల్.. సిగ్గుండాలంటూ

Bigg boss 7: ఇన్స్టాలో రతికకు ఇచ్చినడేసిన రాహుల్.. సిగ్గుండాలంటూ

Bigg boss 7: ఇన్స్టాలో రతికకు ఇచ్చినడేసిన రాహుల్.. సిగ్గుండాలంటూ
X

బిగ్ బాస్ 7లో తన బ్యూటీతో అలరిస్తుంది రతిక. మొదట పల్లవి ప్రశాంత్ తో ట్రాక్ నడిపి.. ఇప్పుడు ప్రిన్స్ యావర్ తో క్లోజ్ గా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లోకి రతిక అడుగుపెట్టగానే.. నాగార్జున తన లవ్ మ్యాటర్ బయటపెట్టాడు నాగార్జున. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రతిక ఇద్దరు ప్రేమించుకున్నారని, ప్రస్తుతం ఇద్దరికి బ్రేకప్ అయిందని చెప్పకనే చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో రతికను ఇన్ డైరెక్ట్ గా తిట్టినట్లు, తన బిహేవియర్ మార్చుకోవాలంటూ ఫైర్ అయ్యాడు.

‘ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? కొందరు తమ ట్యాలెంట్ ను కష్టపడి ప్రూవ్ చేసుకుంటారు. కానీ ఇంకొదరు ఇతరులపై, వాళ్ల పేరుపై ఎప్పుడూ ఆధారపడుతుంటారు. పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. ఫేమ్ కోసం పేరును అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ మొత్త రతికకు సూట్ అయ్యేలా ఉన్నాయి. ఇక రాహుల్ కామెంట్స్ చూసి వీళ్లిద్దరి మధ్య గట్టి విషయం జరిగిందని, రతిక తప్పు చేసింది కాబట్టే ఇద్దరు విడిపోయారని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.



Updated : 20 Sept 2023 10:37 PM IST
Tags:    
Next Story
Share it
Top