Bigg Boss 7 : బిగ్ బాస్ కోసం చీప్ ట్రిక్స్...ఇండైరెక్ట్ గా ఆమెకు ఇచ్చిపడేసిన రాహుల్ సిప్లిగంజ్
X
బిగ్ బాస్ సీజన్7 తెలుగు మూడోవారం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో సరికొత్త టాస్క్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కూడా తమదైన స్టైల్లో హౌస్‌లో రెచ్చిపోతున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ పొందేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ ఫేమ్‌ను పెంచుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఇక తెలంగాణ పాపులర్ సింగర్ , ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతోంది. ఈ గేమ్ లో మాజీ ప్రియుడి పేరుతో ఓటింగ్ పొందేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తనతో బ్రేకప్ అయిందంటూ చేస్తున్న ప్రచారంపై లేటెస్టుగా రాహుల్ సిప్లిగంజ్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా రతికను ఓ రేంజ్లో కడిగేశాడు. ఇవన్నీ బిగ్ బాస్ కోసం ప్రయోగిస్తున్న చీప్ ట్రిక్స్ అంటూ ఫైర్ అయ్యాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ 7లో బ్యూటీ రతిక రోజ్ జర్నీ ఆసక్తికరంగా మారింది. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో..ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తుంది..తన గేమ్ ప్లాన్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. హౌజ్‍లో మొదట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍తో క్లోజ్‍గా మూవ్ అయిన రతిక నామినేషన్ టైమ్‌లో అతడికి గట్టి దెబ్బ కొట్టింది. అప్పటివరకు ప్రిన్స్ యావర్‌ను సపోర్ట్ చేసిన రతిక మూడో వారంలో పవర్ ఆస్త్ర పొందేందుకు ప్రిన్స్ అనర్హుడని ప్లేట్ ఫిరాయించింది. ఇవే కాదు బిగ్ బాస్ ఎంట్రి దగ్గరి నుంచి ఆమె తన స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. రతిక బిగ్ బాస్ హౌజ్‍లోకి వెళ్లిన వెంటనే ఆమె పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రతిక, రాహుల్ క్లోజ్‍గా ఉన్న ఫొటోలు నెట్టింట్లో దుమారం రేపాయి. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా రతికపై పడింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‍లో తన బ్రేకప్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని చెబుతూ తాజాగా రతిక కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇదంతా గేమ్ కోసం చేస్తున్న చీప్ ట్రిక్స్ అని, సింపతీ పొందేందుకే రతిక ఇలా చేస్తోందని ఆమె మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ పరోక్షంగా తెలిపాడు. తన ఇన్‌స్టా పోస్ట్‌తో రతికను కడిగిపారేశాడు.
"నాకు ఒక ప్రశ్న ఉంది. ఆరేళ్ల తర్వాత పర్సనల్ ఫోన్లో ఉన్న ఫొటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో ఎట్లా ప్రత్యక్షమయ్యాయి. లోపలకి వెళ్లే ముందే ప్రీ ప్లాన్ చేశారా? ఫ్రెండ్స్ మీరు దీని గురించి కనుక్కోండి, అసలు నిజం ఏంటో తెలుసుకోండి. నాకూ, వేరొకరి లైఫ్‌కి అసలు ఎలాంటి సంబంధం లేదు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. ప్రతి ఒక్కరికీ కుటుంబ, స్నేహితులు ఉంటారు. వారిపై ఇలాంటివి చాలా తీవ్రంగా ప్రభావం చూపుతాయి. ఈ విషయాన్ని వారు ఇలాంటి పనులు చేసే ముందు గ్రహించాలి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో పాస్ట్ ఉంటుంది. అదే విధంగా ప్రజంట్ కూడా ఉంటుంది. కాబట్టి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రతిదాన్ని స్వంతంగా జడ్జ్ చేయకండి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవారికి థ్యాంక్స్. ఎవరైతే నెగెటివిటీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వావికి ఆల్ ది బెస్ట్" అని రాహుల్ ఇచ్చిపాడేశాడు. పేరు చెప్పకుండానే రతిక పరువు తీసేశాడు.