మణిరత్నంతో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్న తలైవా
X
ఆగస్టులో జైలర్ సినిమా విడుదల కు సిద్ధమవుతున్న తలైవా రజనీకాంత్ అప్పుడే నెక్స్ట్ సినిమా ప్లాన్ లు మొదలుపెట్టేశారు. తరువాతి సినిమా మేకింగ్ మాస్టర్ మణిరత్నం దర్శకత్వంలో చేయనున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది.
ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ కానుంది. దీన ప్రమోషన్స్ కూడా విపరీతంగా జరగనున్నాయి.దీని నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ కావాలయ్యా సెన్సేషనల్ హిట్ అయింది కూడా. వీటిల్లో చురుగ్గా పాల్గొంటూనే రజనీ నెక్స్ట్ సినిమా గురించి ప్లాన్ లు వేసేస్తున్నారుట. కొన్ని రోజులుగా సాలిడ్ హిట్ పడని రజనీ నెక్స్ట్ సినిమాకు పెద్ద దర్శకుడు అయితే బావుండునని అనుకుంటున్నారని వినికిడి. అందుకే ఏకగా మణిరతన్నం దగ్గకు వెళ్ళారని చెబుతున్నారు. రజనీ లైకా మూవీస్ తో రెండు సినిమాలు చేయడానికి ఒకే చెప్పారుట. అందులో తన కూతురు ఐశ్వర్య దర్వకత్వంలో ఒకటి చేస్తుండగా రెండో సినిమా మణిసార్ తో చేయనున్నాడని కోలీవుడ్ పక్కా సమాచారం.
రజనీ-మణిరత్నం కాంబోలో ఇప్పటివరకు ఒకే ఒక సినిమా దళపతి వచ్చింది. అది కూడా క్లాసిక్ హిట్. ఇందులో రజనీతో పాటూ మమ్ముట్టి, శోభన, అరవింద్ స్వామిలాటి వాళ్ళు కూడా నటించారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా మ్యూజిక్, రజనీ-మమ్ముట్టి కాంబో ఆ సినిమాను అగ్ర సింహాసనం మీద కూర్చోబెట్టాయి. వన ఆఫ్ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా దళపతి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అదే మ్యాజిక్ ను రజనీ రిపీట్ చేయాలని అనుకుంటున్నారుట. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో. రజనీ, మణి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే అది పాన్ ఇండియా కాక మరేమవుతుందని అంటున్నారు అభిమానులు.