Home > సినిమా > రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేతపై రైతుల ఆగ్రహం

రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేతపై రైతుల ఆగ్రహం

రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేతపై రైతుల ఆగ్రహం
X

గుంటూరు జిల్లా ఉండవల్లిలో రాజధాని ఫైల్స్ సినిమా నిలివేతపై రైతులు ధర్నా చేశారు. రామకృష్ణ థియేటర్ వద్ద రైతులు, టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో యాజమాన్యం మూవీని నిలిపివేసింది. అలాగే విజయవాడ ట్రెండ్ సెట్ మాల్‌లోనూ రాజధాని ఫైల్స్ సినిమాను రెవెన్యూ అధికారులు అర్ధంవంతంగా నిలివేసివేశారు. షో మధ్యలోనే నిలిపివేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వేసిన పిటీషన్ ఆధారంగా రాజధాని ఫైల్స్ చిత్రం విడుదల చేయవద్దని ఇవ్వాళ హైకోర్డు స్టే ఇచ్చింది. రేపటివరకు నిలుపుదల చేయాలని ఆర్డర్ జారీ చేసింది.

అయితే అప్పటికే థియేటర్లలో సినిమా ఆడుతుండటంతో, పోలీసులు సినిమా హళ్ల వద్దకు చేరుకొని, సినిమాను నిలుపివేశారు. సినిమా నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ఫ్యాన్స్ కంగు తిన్నారు. ఇదేంటని ప్రశ్నించగా హైకోర్టు స్టే ఇచ్చిందని, అందుకే సినిమాను ఆపాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చారు. ఆర్డర్ కాపీని చూపించమని ప్రేక్షకులు కోరగా, పోలీసులు సంబందిత అధికారులు నీళ్లు నమిలారు. మధ్యలో మూవీని ఎలా ఆపుతారని, డబ్బు పెట్టి టికెట్లు కొన్న మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అవన్నీ మాకు తెలియదని, కోర్టు ఆర్డర్ ప్రకారమే నిలిపి వేస్తున్నామని చెప్పి బలవంతంగా థియేటర్ ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా, పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య వాగ్వివాధం జరిగింది. దీంతో థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ.. కొందరు అభిమానులు రోడ్డుపై భైఠాయించి ధర్నా నిర్వహించారు.




Updated : 15 Feb 2024 11:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top