Bubblegum Movie Teaser : రోషన్ కనకాల బబుల్ గమ్ టీజర్ ఎలా ఉంది
X
నటులుగా మొదలుపెట్టి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంట రాజీవ్ కనకాల, సుమ. ప్రస్తుతం సుమ టాలీవుడ్ టాప్ యాంకర్. రాజీవ్ నటుడుగా ఎప్పుడూ బిజీ.ఇలా వీరిని చూస్తోన్న జనానికి తమ వారసుడిని హీరోగా చూపించబోతున్నారు. సుమ,రాజీవ్ తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి యూత్ ఫుల్ మూవీస్ హిట్స్ కొట్టిన రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేసిన ఈ మూవీ పేరు బబుల్ గమ్. వివేక్ కూచిభొట్ల నిర్మించిన బబుల్ గమ్ టీజర్ విడుదలైంది.
టీజర్ చూడగానే దర్శకుడు మరోసారి యూత్ ఫుల్ కంటెంట్ నే సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం అవుతోంది. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఒక రిచ్ అమ్మాయితో ప్రేమలో పడి తనూ రిచ్ అని అబద్ధం చెప్పి దాన్ని మెయిన్టేన్ చేయలేక నానా తంటాలు పడటం.. చివరికి అమ్మాయికి నిజం తెలిసి విడిపోతే మళ్లీ ఆ అమ్మాయిని ఒప్పించడం కోసం ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం.. ఇదీ.. టీజర్ లో కనిపించిన అంశం. కొత్తగా ఉందా అంటే చెప్పలేం. టేకింగ్ కొత్తగా ఉంటే ఓకే. బట్ ఈ తరహా కంటెంట్ ఇప్పటికే చాలాసార్లు చూసి ఉన్నాం. దాన్ని దాటి మెప్పించడం దర్శకుడికి కష్టమేం కాదు. అయితే హీరో నేపథ్యం కొత్తగా కనిపిస్తోంది. కుర్రాడు నటన పరంగా చాలా బెటర్ గా ఉన్నాడు. తన నానమ్మ, తాతయ్యలే నట గురువులు కాబట్టి అన్ని ఎక్స్ ప్రెషన్స్ ఈజీగా పలికించాడు. రొమాన్స్ పరంగానూ కాస్త దూకుడుగానే ఉన్నాడు రోషన్. లుక్స్ పరంగా యావరేజ్ గా ఉన్నా నటనతో మెప్పించే అవకాశాలున్నాయి.
ఇక రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రల్లో హర్ష చెముడు, కిరణ్, అనన్య, హర్ష వర్ధన్ నటించారు. మొత్తంగా ప్రేమంటే బబుల్ గమ్ లాంటిదని..మొదట్లో తీయగా ఉన్నా తర్వాత చప్పగా మారి చెప్పులకు అతుక్కుని ఇబ్బంది పెడుతుందనే డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ లో దర్శకుడికి ప్రేమపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియజేస్తుంది. దీన్నే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనుకోవాలి అంటే అది వారి ఇష్టం.