Home > సినిమా > Rajinikanth as Governor :గవర్నర్‎గా రజినీకాంత్?...తమ్ముడు ఏమన్నారంటే..

Rajinikanth as Governor :గవర్నర్‎గా రజినీకాంత్?...తమ్ముడు ఏమన్నారంటే..

Rajinikanth as Governor  :గవర్నర్‎గా రజినీకాంత్?...తమ్ముడు ఏమన్నారంటే..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్‏లో దూసుకుపోతోంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. గత నెల రోజులుగా థియేటర్లలో జైలర్ హవా కొనసాగుతోంది. ఇదే క్రమంలో తాజాగా రజినీకాంత్‎కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. త్వరలో రజినీకాంత్ గవర్నర్ కాబోతున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

జైలర్ విడుదల తరువాత ఈ మధ్యనే కొద్ది రోజులు రజినీకాంత్ హిమాలయాల్లో సేదదీరారు. పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు సందర్శించడంతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్‏ను కలిశారు. అంతే కాదు ఆయన కాళ్లకు మొక్కారు. ఈ విషయంపై నెట్టింట్లో పెద్ద చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవలె జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో రజినీ సమావేశం అయ్యారు. జైలర్ సినిమా తరువాత తలైవా బీజేపీ పెద్దలతో బాగా టచ్‎లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం త్వరలోనే రజినీకాంత్‎కు గవర్నర్ పదవి కట్టబెడుతుందనే వార్తలు నిపిస్తున్నాయి.

ఈ విషయంపైనే తాజాగా రజినీకాంత్ సోదరుడు స‌త్య‌నారాయ‌ణ రావు మాట్లాడుతూ.." మా సోదరుడు రాజ‌కీయాల్లోకి రారు. ఒకవేళ వస్తే అందరం ఆనందిస్తాం. నిజానికి రజినీకాంత్‎కు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టం. గవర్నర్‌ పదవి అనేది భగవంతుడి చేతుల్లో ఉంది. రజినీకాంత్‎కు గవర్నర్ పదవి వస్తే మంచిదే కదా " అంటూ ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఇక రజినీకాంత్‎కు గవర్నర్ పదవి ఖాయమంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఫ్యాన్స్ కూడా రజినీకాంత్‎కు గవర్నర్ పదవి రావాలంటూ ఆశిస్తున్నారు. నిజానికి గవర్నర్ పదవి రజినీకాంత్‎కు ఇచ్చే ఆలోచనలో మోదీ కేంద్రం ఉందా? ఒకవేళ ఇచ్చినా తలైవా ఈ పదవిని స్వీకరిస్తారో లేదో అన్నది వేచి చూడాల్సిందే.


Updated : 4 Sept 2023 5:29 PM IST
Tags:    
Next Story
Share it
Top